ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: పేదవాడి సొంతింటి కల సహకారానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల్లో అర్హుల గుర్తింపు, నిర్ణిత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. 
 

Back to Top