వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల మ‌ద్ద‌తు ధ‌ర‌ల పోస్టర్‌ ఆవిష్కరణ‌

ఆర్బీకేల్లో పోస్ట‌ర్ ప్ర‌ద‌ర్శించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేపల్లి: ఈ నెల 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల పోస్టర్‌ను ప్రదర్శించాలని సంబంధిత మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల (ఎంఎస్‌పీ) వివరాల పోస్టర్‌ను సీఎం వైయస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ  కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు.

Back to Top