చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు

పోలవరం నిర్మాణం చూస్తే బాబు తెలివితేటలు ఏపాటివో అర్థమవుతాయి

అప్రోచ్‌ఛానల్‌ పూర్తికాకుండా అప్పర్‌ కాఫర్‌ డ్యామ్, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లు క‌ట్టి..వాటిలోలో రెండేసి గ్యాప్‌లు పెట్టాడు 

2.1 కిలోమీటర్ల విస్తీర్ణ గోదావరి నీటి ఉధృతికి డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది

సామాన్య వ్యక్తిని అడిగినా ఈ వెదవ పనిచేసింది ఏ ముఖ్యమంత్రి అని నిలదీస్తారు 

తప్పు చేసి ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని మాపై నిందలు వేస్తున్నాడు

అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన అద్భుతమని చప్పట్లు కొట్టాడు

ప్యాకేజీ బ్రహ్మాండమైన సిగ్గులేకుండా అసెంబ్లీలో చెప్పాడు

ఐదేళ్లలో పోలవరం నిర్వహితులకు బాబు ఖర్చు చేసింది రూ.193 కోట్లు మాత్రమే

మూడేళ్లలో 10,330 మంది నిర్వాసితులకు రూ.1773 కోట్లు ఖర్చు చేశాం

నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు జీవో కూడా విడుదల చేశాం

గతంలో 1.5 లక్షల తీసుకున్నవారికి రూ.5 లక్షల పెంచి ఇస్తాం

పోల‌వ‌రం నిర్మాణానికి మ‌నం ఖ‌ర్చు చేసి 2900 కోట్లు కేంద్రం ఇంకా ఇవ్వ‌లేదు

పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

అసెంబ్లీ: ‘‘చంద్రబాబు తెలివితేటలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చూస్తే అర్థం అవుతుంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు.. చంద్రబాబు అసలు ఎమ్మెల్యే కావడానికి కూడా అనర్హుడు. ఈ స్థాయిలో ప్రజలను మోసం చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలవరంపై సీఎం వైయస్‌ జగన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను ఫొటోలు, వీడియోలతో సహా సభ సాక్షిగా వివరించారు. గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద చంద్రబాబు రూ.6.86 లక్షలు ఇస్తే.. దాన్ని రూ.10 లక్షలు చేస్తామని చెప్పాం.. అందుకు తగ్గట్టుగానే జీవో కూడా విడుదల చేశాం. దాని గురించి ఆక్షేపణ, చర్చ కూడాఅవసరం లేదన్నారు. 30–06–2021లో ఇచ్చిన జీవో చూడండి.. కళ్లు ఉండి చూడలేకపోతే ఏం చెప్పలేను గానీ, కళ్లుండి చూడగలిగితే దయచేసి చూడండి అని అసెంబ్లీలోని ఆ జీవోను సీఎం వైయస్‌ జగన్‌ ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

పోలవరం డ్యామ్‌ పూర్తయిన తరువాత మొదట నీటిని నిల్వ చేసేది 41.15 మీటర్ల ఎత్తుకు. డ్యామ్‌ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం కూడా మంచిది కాదని సీడబ్ల్యూసీ నిబంధనలు కూడా చెబుతాయి. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్లకు మొట్టమొదటగా నీటిని నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కాంపన్సేషన్‌ పూర్తిగా పోలవరం ప్రాజెక్టులో లక్షా 6 వేల 6 మంది నిర్వాసితులకు 41.15 మీటర్ల కాంటూర్‌ వరకు సంబంధించి అందులో 20,946 మంది నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది. మిగిలిన 85.60 వేల మంది నిర్వాసితులు 45.72 మీటర్ల లెవల్‌లోకి వస్తారు. వీరందరికీ పునరావాసం కల్పించాల్సి ఉండగా 41.15 మీటర్ల లెవల్‌కు సంబంధించి 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తయింది. దీనికి అయిన మొత్తం ఖర్చు రూ.1960.95 కోట్లు. ఈ 14,110 నిర్వాసితుల్లో 707 నిర్వాసితులకు 2014 కంటే ముందే పునరావాసం కల్పించి రూ.44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,073 మంది నిర్వాసితులకు రూ.193 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అదే విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1772.78 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. పునరావాస పనులు 41.15 మీటర్ల లెవల్‌ వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 2022లోగా మిగిలిన 6,836 మందికి కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. మొత్తం 41.15 మీటర్ల వరకు చేర్పించడం కోసం  అదనంగా ఇవ్వాల్సిన (6.80 లక్షలకు రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పాం) దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం రూ.500 కోట్లు మాత్రమే. దాని కోసం ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. బటన్‌ నొక్కి అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల కింద వేల కోట్ల రూపాయలు బటన్‌ నొక్కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. అలాంటిది రూ.500 కోట్ల విషయంలో ఏదో పెద్ద పరిస్థితులు వస్తాయని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు. పునరావాసం కల్పించే కార్యక్రమం పూర్తయ్యేలోపు రూ.500 కోట్లు నిర్వాసితులకు ఇవ్వడం జరుగుతుంది. 

2900 కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రావాలి. మన ప్రభుత్వ డబ్బుతో ప్రాజెక్టుకు ఖర్చు చేశాం. ఇంకా కేంద్రం నుంచి డబ్బులు రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం.. చంద్రబాబు ఆరోజు అర్ధరాత్రిపూట లేని స్పెషల్‌ ప్యాకేజీ ఒకటి యాక్సెప్ట్‌ చేసి.. 2011కు సంబంధించి పాత రేట్ల ప్రకారం ఇస్తామని వారు చెప్పడం.. ఏ రకంగా అది సాధ్యపడుతుంది.. ఏదైనా ప్రాజెక్టు ముందుకెళ్లే కొద్దీ రేట్లు పెరుగుతాయి కదా.. ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా..? పోలవరం ప్రాజెక్టు  అథారిటీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కదా.. వారే కదా ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేట్‌ మాత్రం చేస్తుంది కదా.. అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా..? అడగాల్సిందిపోయి.. గుడ్డిగా యాక్సెప్ట్‌ చేసి.. దానికి తోడుగా అరుణ్‌జైట్లీ స్టేట్‌మెంట్‌ ఇస్తుంటే.. పక్కనే సుజనా చౌదరి, కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీవారు.. అందరూ నిలబడి యాక్సెప్ట్‌ చేశారు. మరుసటి రోజు చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చిందని సిగ్గులేకుండా చెప్పి.. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసే కార్యక్రమం చేశాడు.

చంద్రబాబు చేసిన పాపానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పాత రేట్లు ఇస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. ప్రాజెక్టు సవరించిన అంచనాల రేట్లకు కేంద్రాన్ని ఒప్పించడం కోసం నానా అగచాట్లు పడుతున్నాం. ఇవన్నీ ఇబ్బందులు పడుతూనే.. రాష్ట్ర డబ్బును ప్రాజెక్టుకు రూ.2900 కోట్లు ఖర్చు చేశాం. ఆ డబ్బు  ఇంకా కేంద్రం చెల్లించలేదు. కారణం.. చంద్రబాబు పుణ్యమే. 

గతంలో రూ.1.5 లక్షలు ఇచ్చారో.. వారందరికీ రూ.5 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నాం. ఏ ఒక్కరూ ఎటువంటి బాధాపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా అన్నీ జరుగుతాయి. పునరావాసం మీద టీడీపీ అధికారంలో ఉండగా ఐదు సంవత్సరాల్లో కలిపి కూడా కేవలం 3073 మంది నిర్వాసితులకు మాత్రమే కేవలం రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. పునరావాసం మీద వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల కాలంలో 10,330 మంది నిర్వాసితులకు రూ.1773 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. పునరావాసానికి సంబంధించి మా చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం కూడా అవసరం లేదు. 

ప్రాజెక్టును ఏరకంగా చంద్రబాబు దగ్గరుండి నాశనం చేశారో కూడా చూపిస్తా. నాశనం చేసిన దాన్ని రిపేర్‌ చేయడం కోసం ఎన్నెన్ని కుస్తీలు పడుతున్నామో చూపిస్తా. 

గోదావరి నది 2.1 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటుంది. నదికి అటువైపున స్పిల్‌ వే కట్టాలి. ఆ స్పిల్‌ వే పూర్తిచేసి నీరు డైవర్ట్‌ చేసి కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించాలి. కాఫర్‌ డ్యామ్‌ టెంప్రరరీ స్ట్రక్చర్‌. అది మెయిన్‌ డ్యామ్‌ కట్టానికి ఉపయోపడుతుంది. కాఫర్‌ డ్యామ్‌ స్పిల్‌ వే పనులు, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తిచేసి నీరు డైవర్ట్‌ చేసే వెసులుబాటు కల్పించిన తరువాత కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. తరువాత మెయిన్‌ డ్యామ్‌ కట్టాలి. మెయిన్‌ డ్యామ్‌ మధ్యలో ఉంచి కాఫర్‌ డ్యామ్‌ 2 కట్టాలి. ఇవన్నీ కట్టకముందే స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తిచేయాలి. 

అలాంటిది చంద్రబాబుకు ఏం తెలివితేటలు ఉన్నాయో తెలియదు.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు.. చంద్రబాబు అసలు ఎమ్మెల్యే కావడానికి కూడా అనర్హుడు. ఆ స్థాయిలో మోసం చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. ఒకవైపున స్పిల్‌ కంప్లీట్‌ కాకుండా.. అప్రోచ్‌ఛానల్‌ కంప్లీట్‌ కాకుండా.. 2.1కిలోమీటర్ల గోదావరి విస్తీర్ణానికి అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ కట్టి.. దానికి రెండుగ్యాప్‌లు విడిచిపెట్టారు. లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లో కూడా రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. నీరు స్పీల్‌ వే పైనుంచి వెళ్లలేక, గ్యాప్‌ల గుండా వెళ్లాల్సివచ్చేసరికి ఉధృతి పెరిగి డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది. దీనికి కారణం ఎవరు అని అడిగితే సామాన్య వ్యక్తి కూడా ఏ ముఖ్యమంత్రి చేసింది ఈ వెదవ పని అని చెప్తారు. మీరు చేసిన తప్పును మాపై వేసేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. మా కర్మ ఏంటంటే.. మీకే ఈనాడు ఉంది.. మీకే ఆంధ్రజ్యోతి ఉంది.. మీకే టీవీ5 ఉంది. ఎల్లో మీడియా మొత్తం మీదే.. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. 

అప్రోచ్‌ ఛానల్‌
– అప్రోచ్‌ ఛానల్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో జూన్‌ 2019లో ఇలా బీడుబీడుగా ఉన్న భూమి.. ఏకంగా అప్రోచ్‌ ఛానల్‌ తయారు చేసి నీళ్లను డైవర్ట్‌ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తుంది. 
– జూన్‌ 2021కు అప్రోచ్‌ ఛానల్‌లోకి నీళ్లు డైవర్ట్‌ చేశాం. మార్చి 2022కు అప్రోచ్‌ ఛానల్‌కు పూర్తిగా నీరు డైవర్ట్‌ చేసేశాం. స్పిల్‌ వే నుంచి నీరు వచ్చేందుకు రెడీ అయ్యింది. 

స్పిల్‌ వే 
– చంద్రబాబు 2018లో స్పిల్‌ వే పనులు ఏమాత్రం కూడా పూర్తికాకుండా పునాదులు వేసి.. ఏకంగా ఆయన, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య, జయము జయము చంద్రన్న అనే పాట. స్పీల్‌ వే పూర్తికాకుండానే అయిపోయినట్టుగా ప్రచారం చేశారు. 
– మార్చి 2019లో పీయర్స్‌ అన్ని పైకిలేవాలి. గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తరువాత స్పిల్‌ వే ఛానల్‌ పూర్తికాదు. 
– మేము వచ్చిన తరువాత జూన్‌ 2019లో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 
– జూన్‌ 2021కు పూర్తిగా అక్కడ నుంచి పీయర్స్‌ అని పైకిలేచాయి. 
– ఆగస్టు 2021లో గేట్లు పెట్టి అప్రోచ్‌ఛానల్‌ నుంచి నీరు డైవర్ట్‌ చేసి స్పిల్‌ వే నుంచి నీరు బయటకు పంపిస్తున్నాం. ఇది చేయకుండా బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాఫర్‌ డ్యామ్‌ కడతాడా..? 
– ఆగస్టు 2022లో స్పీల్‌ వే నుంచి గోదావరి నీరు బయటకు వెళ్తున్నాయి. 
– ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో రెండు గ్యాప్‌లు పెట్టారు. ఒక గ్యాప్‌ 380 మీటర్లు, మరో గ్యాప్‌ 300 మీటర్ల గ్యాప్‌ పెట్టి నీరు వదిలారు. ఈ గ్యాప్‌ల మధ్య నీరు వెళ్లే సరికి ఉధృతికి వాల్‌ దెబ్బతిన్నది. 
– మెయిన్‌ డ్యామ్‌లో కూడా గ్యాప్స్‌ పెట్టారు. 
దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 680 మీటర్ల గ్యాప్‌. మరోవైపు 120 మీటర్ల గ్యాప్‌ పెట్టారు. నీరంతా ఈ గ్యాప్‌ల నుంచి వెళ్లే  పరిస్థితి వల్ల డయాఫ్రం వాల్‌ పూర్తిగా కింద నుంచి దెబ్బతిన్నది. అదంతా కిందనుంచి నిర్మించుకుంటూ వస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం.. ఈ తప్పుడు పనులు  అని ఎందుకు  అర్థం కావడం  లేదు. మళ్లీ మాపై నిందలు వేయడానికి మనసు ఎలా వస్తుంది. అసలు మనుషుల్లా ఆలోచన చేస్తున్నారా.. రాక్షసుల్లా ఆలోచన చేస్తున్నారా అని ఎందుకు టీడీపీకి అర్థం కావడం లేదు. 

ఇప్పటికీ చెప్తున్నాం.. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ అయిపోయింది.. దురదృష్టం కొద్దీ లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ 30.5 మీటర్ల వరకు ఎత్తు పెంచాల్సిన చోట అనుకోకుండా వర్షం, వరదలతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డ్రాయింగ్‌ క్లియరెన్స్‌ అనుకున్న దానికంటే జాప్యం జరిగింది. దీంతో లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ అనుకున్న స్పీడ్‌ మేరకు జరగలేకపోయింది. 30.5 మీటర్ల ఎత్తుకు కట్టాల్సి ఉండగా.. 21 నుంచి 23 మీటర్ల ఎత్తు వరకే నిర్మించగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది. ఇలా రెండు గ్యాప్‌ల కారణంగా ఫౌండేషన్‌ నుంచి మళ్లీనిర్మించాల్సి వచ్చింది. జూలై 30 వరకు సమయం ఉంటే పూర్తిగా 30.5 మీటర్లు కంప్లీట్‌ అయిఉండేది. వర్షాల కారణంగా పనుల్లో కొంత ఆలస్యమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబర్‌లో పనులు ప్రారంభం అవుతాయి. యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టును పూర్తిచేయడానికి అడుగులు పడుతున్నాయి. దీన్ని వక్రీకరించి ప్రజలనుమభ్యపెట్టాలని చూసినా.. ప్రజల్లో టీడీపీ చులకన  అవుతుంది తప్ప.. ఏమీ ప్రయోజనం ఉండదు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top