ఎమ్మెల్యే జోగారావును ప‌రామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: పార్వతీపురం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఎమ్మెల్యే జోగారావు మాతృమూర్తి సంతోషమ్మ మ‌ర‌ణించారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే జోగారావును ఫోన్‌లో పరామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. సంతోషమ్మ మృతికి త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Back to Top