గుర్రం జాషువాకు సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

తాడేపల్లి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. ‘‘తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి’’ అర్పిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top