మ‌హానేత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌ నివాళి

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్..‌ రాత్రి అక్క‌డే బ‌స చేశారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీ‌నివాసులు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.

Back to Top