తెలుగు జాతి నవయుగ వైతాళికుడు కందుకూరి

కందుకూరి వీరేశలింగంకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి
 

 
తాడేపల్లి: తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకూ విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘసంస్కర్త ఆయన. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్బంగా ఘననివాళి’అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top