తాడేపల్లి: కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే. వి. రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కే. ఎస్. జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.