శాంతియ‌జ్ఞంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గ‌ల గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. శాంతి య‌జ్ఞంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొని వేద‌పండితులు ఆశీర్వ‌చ‌నాలు స్వీక‌రించారు. 

Back to Top