మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

గుంటూరు: గుంటూరు నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ను ముస్లింలు ఘనంగా సత్కరించారు. 

Back to Top