రేపు తిరుమలకు సీఎం వైయ‌స్‌ జగన్‌

బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ‌వారికి పట్టువ్రస్తాల సమర్పించనున్న ముఖ్యమంత్రి  

28న నంద్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: క‌లియుగ దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారికి ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈనెల 27వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుప‌తికి బ‌య‌ల్దేర‌నున్నారు. తిరుమ‌ల చేరుకున్న అనంత‌రం అలిపిరి వద్ద తిరుమలకు ఎల‌క్ట్రిక్ బస్సును ప్రారంభించ‌నున్నారు. రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్‌ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.  

నంద్యాల జిల్లాలో పర్యటన 
సీఎం వైయ‌స్‌ జగన్ ఈనెల 28న (బుధవారం) ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళతారు. కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 2.20గంటలకు తాడేపల్లిలోని త‌న నివాసానికి చేరుకుంటారు. 

Back to Top