కేపీ రెడ్డ‌య్య యాద‌వ్ భౌతిక‌కాయానికి సీఎం నివాళి

విజ‌య‌వాడ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి తండ్రి, మాజీ ఎంపీ కే.పి. రెడ్డయ్య యాదవ్‌ భౌతిక కాయానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళులర్పించారు. విజయవాడ బందర్‌ రోడ్‌లో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారధి నివాసానికి చేరుకొని ఆయ‌న తండ్రి, మాజీ ఎంపీ రెడ్డ‌య్య యాద‌వ్ భౌతిక కాయానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పార్థ‌సార‌ధి కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ప‌రామ‌ర్శించారు. 

Back to Top