సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా ర‌ప్పించేందుకు చ‌ర్య‌లు

 అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలన్న సీఎం

తాడేప‌ల్లి: అంతర్యుద్ధం కారణంగా సుడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే… వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకుని అక్కడనుంచి స్వస్థలాలకు చేరుకునే వారకూ కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులు సీఎంకు వివరించారు.
 

Back to Top