ప్ర‌జ‌లంతా సుసంప‌న్నంగా ఉండాలి

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ న్యూయ‌ర్ విషెస్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌..
`ప్ర‌జ‌లంద‌రికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీరు నాపై చూపిన ప్రేమ, మద్దతు, నమ్మకానికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు` తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top