నా మతం మానవత్వం.. కులం మాట నిలబెట్టుకోవడం 

ఆరోగ్య ఆసరా కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ 

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు

చికిత్స తర్వాత కొలుకునే సమయంలో ఆర్థికసాయం

ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల రోగాలకు పెంపు

తలసేమియా, సికిల్‌సెల్‌, హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛన్‌

జనవరి 1 నుంచి కేన్సర్‌ పేషంట్లు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు

జనవరి 1న హెల్త్‌రికార్డులతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ 

ప్రభుత్వాస్పత్రులన్నీ ప్రైవేట్‌ ఆసుప్రతులకు దీటుగా అభివృద్ధి

ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం

 
గుంటూరు: నా మతం మానవత్వం..కులం మాట నిలబెట్టుకోవడమే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తన కులం, మతంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావిస్తున్నాయని తప్పుపట్టారు. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత  విశ్రాంతి సమయంలో పేషెంట్ కోలుకునే వరకు ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేషెంట్లకు ఆర్థికసాయం చెక్కులను సీఎం చేతులు మీదుగా అందజేశారు. గుంటూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
 కొద్ది నెలల కిందట మాటిచ్చాను. ఎన్నికలకు ముందు, పాదయాత్ర చేస్తుండగా ఇచ్చిన మాటను పక్కన పెట్టకుండా, మేనిఫెస్టో అన్నది ఒక భగవత్గీత, ఖురాన్‌, బైబిల్‌గా పాటిస్తూ..ఇచ్చిన  మాటను నెరవేర్చుతున్నాను. ఈ రోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే ఇవాళ జీర్ణించుకోలేని పరిస్థితి. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటిమాటలు వింటే బాధనిపిస్తోంఇ. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం.. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న  ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆరోగ్య అంశంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాం. ఇక్కడి నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఆపరేషన్‌ చేయించుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో కడుపు నిండని పరిస్థితిలో పనులకు వెళ్లేదాన్ని మార్చుతూ..ఆ రోగి కోలుకునేందుకు వీలుగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా ఆరోగ్య ఆసరాగా ప్రవేశపెడుతున్నాం. ఆపరేషన్‌ చేయించుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో ఆ రోగులు ఇంట్లో పస్తు పండుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేలకు వరకు ఎన్ని రోజులైనా, నెలలైనా డాక్టర్లు సిఫార్సును ఈ పథకానికి వర్తిస్తూ అమలు చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఏ ఆపరేషన్‌కు ఎంత ఇవ్వాలన్నది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది. సంపాదించే వ్యక్తి ఆపరేషన్‌ చేయించుకునే పరిస్థితి, రోగాలతో బాధపడుతున్న పరిస్థితిలో విశ్రాంతి సమయంలో ఆదాయం లేని ఆ కుటుంబాలకు ఎంతగా సతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశాను. అటువంటి కుటుంబాలకు ఆ రోజు నేను విన్నాను..నేను ఉన్నానని మాట చెప్పాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నాను. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాను. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసిన సమయంలో మీ కష్టాలు విన్నాను. చూశాను..ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తూ సంవత్సరం ఆదాయం రూ.5 లక్షలు ఉన్న వారందరికీ జనవరిలో కొత్త ఆరోగ్య శ్రీ కార్డును ప్రవేశపెడుతున్నాం. ఈ కార్డులకు క్యూఆర్‌ కోడ్‌ ఇస్తాం. వాళ్ల వివరాలన్ని కూడా ఆ క్యూఆర్‌లో భద్రపరుస్తాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల రోగాలకు  విస్తరిస్తూ జనవరిలో అమలు చేస్తున్నాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేందుకు తపన, తాపత్రయంతో ముందుకు వెస్తున్నాం. ఇది చేయడానికి కాస్త సమయం పడుతుంది. మొట్ట మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టును నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీలో 2 వేల రోగాలకు విస్తరిస్తాం.  ఏప్రిల్‌ నుంచి నెలకు ఒక జిల్లాలో అమలు చేస్తాం. ఈ కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం. 104, 108 నంబర్లకు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితి గతంలో లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చుతూ అక్షరాల 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తూ ఏప్రిల్‌ నాటికి 104, 108 వాహనాలు 20 నిమిషాల్లో మీ వద్దకు వచ్చి మంచి ఆసుపత్రికి చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఆపరేషన్‌ చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనే విశ్రాంతి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాం.
వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని అక్టోబర్‌ 10న అనంతపురంలో శ్రీకారం చుట్టాం. మొదటి దశగా బడి పిల్లలకు దాదాపుగా 66 లక్షల పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా ఏదైనా ఆపరేషన్లు చేయించే కార్యక్రమం, కంటి అద్దాల పంపిణీ జరుగుతుంది. తరువాత అవ్వాతాతలు, ఆ తరువాత మిగిలిన కేటగిరిలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడానికి గర్వపడుతున్నాం.
ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తీసుకువస్తూ..హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఆరోగ్యశ్రీలో 130 ఆసుపత్రులను నవంబర్‌ 1 నుంచే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎక్కడైనా కూడా మంచి ఆసుపత్రుల్లో సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్‌ 15 నాటికి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో 510 రకాల మందులు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఏప్రిల్‌ నాటికి డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తాం. డిసెంబర్‌ ఆఖరి వారంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు నాడు- నేడు కార్యక్రమం ద్వారా చేపడుతున్నాం. మూడేళ్లలో పూర్తిగా మార్పులు తీసుకువస్తాం. నాడు-నేడు ఫోటోలు చూపించి రూపురేఖలు మార్చుతాం. జాతీయ ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌ చేస్తామని గర్వంగా చెబుతున్నాం. 

Read Also: సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తున్నారు​

జనవరి 1వ తేదీన కొత్త హెల్త్‌ రికార్డులతో కూడిన హెల్త్‌కార్డులు పంపిణీ చేస్తాం. డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నాం. జనవరి 1 నుంచి తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్‌ ఇస్తాం. పశ్చపాతం, మంచానికి పరిమితమైన రోగులకు కూడా రూ.5 వేలు పింఛన్‌ ఇస్తాం. బోదకాలు, కిడ్నీవ్యాధిగ్రస్తులను రూ.5 వేల కేటగిరిలోకి తీసుకువస్తాం. లెప్రసీ వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తాం. 
నర్సింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత ఉంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్‌ రంగంలో ఉండేలా పోటి పడేలా చేస్తాం. మే నాటికి పూర్తిగా నియామకాలు భర్తీ చేస్తాం. 
క్యాన్సర్‌ పేషెంట్లకు సంబంధించి వివరాలు అడిగాను. కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించేందుకు ఇబ్బంది పడేవారు. జనవరి 1 నుంచి క్యాన్సర్‌ పేపెంట్లకు కీమోథెరపీ చేయించేందుకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తాం. ప్రతి క్యాన్సర్‌ పేపెంట్లకు ఎన్ని సైకిల్స్‌ అవసరమో అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని గర్వంగా చెబుతున్నాను. నెట్‌వర్క్‌ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. ఆసుపత్రుల్లో గ్రేడింగ్‌ చేయిస్తాం. గ్రేడ్‌ ఏ, గ్రేడ్‌ఏ ఫ్లస్‌గా గ్రేడింగ్‌ చేయిస్తాం. అలా మారితేనే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. గ్రేడ్‌ మారకపోతే ఆరోగ్యశ్రీ కట్‌ చేస్తాం. వైద్యసేవలు అందించేందుకు పూర్తిగా సిన్సియర్‌గా అందించాలి. 
నాడు-నేడు కార్యక్రమంలో దాదాపు రూ.13 వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడమే కాకుండా 7 చోట్ల కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం కార్యక్రమానికి డబ్బులు కష్టంగా ఉన్నా కూడా ..నా వద్ద ఎలాంటి మంత్రదండం లేకపోయినా కూడా మంచి చేయడానికి మంచి మనసు ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు దీవిస్తారని ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను. చివరిగా  ఒక్క మాట..వైద్యం అన్నది ఒక పార్ట్‌ ఆఫ్‌ స్టోరీ, వైద్యంతో పాటు ప్రజలు అలవాట్లు మారాలి. సమాజం మారాలి. ఇవన్నీ జరిగితేనే వైద్యంపై మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది.  ఇందుకోసమే మద్యాన్ని దశలవారీగా నియంత్రిస్తున్నాం. దాదాపుగా 45 వేల బెల్ట్‌షాపులు రద్దు చేయించాం. మద్యం షాపులు 20 శాతం కోత విధించాం. మద్యంషాపుల వద్ద వేళలు పెట్టాం. ఎక్కడా కూడా లాభాపేక్ష ఉండకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్‌ను తీసేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 40 శాతం బార్లలో కోత విధించాం. ఇవన్నీ చేస్తేనే ఆరోగ్యమన్నది బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నాను. ఈ అడుగులు వేస్తునే ఒక మంచి సొసైటీ కావాలని ..ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. మంచి సొసైటీగా మార్చితేనే మంచి ఫలితాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. మంచి పాలన అందుతున్నప్పుడు సాధారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు.  ఎన్ని చేసినా మీ అందరి దీవెనలు, దేవుడి దయ ఉందని గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరి సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడు ఇవ్వాలని, ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నా..

 

Read Also: సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తున్నారు​

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top