చదువు అనే గొప్ప ఆస్తిని ఇస్తా

తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే అతిగొప్ప ఆస్తి చదువు

పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నా..

చదువు కోసం ఏ కుటుంబం అప్పులు కాకూడదని ‘అమ్మఒడి’

పేద కుటుంబాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా ఎదగాలి

మౌలానా జయంతిని మైనార్టీ వెల్ఫేర్‌గా వైయస్‌ఆర్‌ ప్రకటించారు

బాబు, వెంకయ్యనాయుడు మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారు

పవన్‌ కల్యాణ్‌.. మీ ముగ్గురు భార్యల పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు

ఇంగ్లిష్‌ రాకపోతే ప్రపంచంతో మనం పోటీపడలేం

పిల్లలంతా ఆంగ్ల మాధ్యమంలో చదవాలనేది ప్రభుత్వ ఆలోచన

చిల్డ్రన్స్‌ డే రోజు నాడు – నేడు కార్యక్రమానికి శ్రీకారం

తెలుగు, ఉర్దూ ఏదైనా భాషా కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం

పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు మీ తమ్ముడు ఇస్తాడు

మదర్సా బోర్డు క్రియేట్‌కు సంబంధిత మంత్రికి ఆదేశాలిచ్చాం

జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: పిల్లలను చదివించే స్థోమత లేక మధ్యలో మాన్పించిన పరిస్థితులను చూశానని, మా ప్రభుత్వం చదువు అనే గొప్ప ఆస్తి  ఇస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గర్వంగా చెప్పారు. పిల్లల చదువుల వల్ల అప్పులపాలవుకుండా త్వరలోనే అమ్మ ఒడి పథకాన్ని తీసుకువస్తామని చెప్పారు.  వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామని, నాలుగేళ్లలో పదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం అమలవుతుందని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూ జీవో విడుదల చేయగానే ప్రతిపక్షాలు ఈర్ష్యగా మాట్లాడుతున్నాయని, వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని సవాలు విసిరారు. ఉన్నత విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకువస్తామని సీఎం పేర్కొన్నారు. జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే ..ఆయన మాటల్లోనే..

ఒక దీపం గదికి వెలుగునిస్తే..చదువుల దీపం కుటుంబానికే వెలుగు  
సభకు వచ్చిన పెద్దలకు, నా సహచరులకు, అధికారులకు, సోదరులు, సోదరిమణులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమసుమాంజలి తెలుపుతున్నాను. భారత రత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 131వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అప్పట్లో ఆ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2008న మౌలానా జయంతిని మౌనారిటీ సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. మౌలానా ఆజాద్‌ గురించి చెప్పాల్సి వస్తే..అందులో గొప్ప కార్యక్రమం ఏంటంటే..దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్‌. ఏకంగా 1947 నుంచి 1958 వరకు దాదాపు 11 ఏళ్లు దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఈ రోజు ఈ దేశంలోనూ, రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక విద్యా, యూనివర్సిటీ వరకు కేంద్రంలో పని చేస్తున్న సంస్థలను ఆజాద్‌ ప్రారంభించారని గుర్తు చేశారు. ఒక దీపం గదికి వెలుగునిస్తే..చదువుల దీపాలు కుటుంబానికే వెలుగులు ఇస్తాయని మనందరికి తెలుసు. పేదరికం నుంచి బయట పడాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం చదువులు. చదువులు ఎంత అవసరమో, పేదరికం అన్నది పోవాలంటే మన కుటుంబాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలి, కలెక్టర్లుగా ఎదగాలి. ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌. పేదరికమన్నాది పోవాలంటే ఉన్నత చదువులు చదవాలి. పెద్ద పెద్ద పదవుల్లోకి మన పిల్లలు పోవాలి. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదల గుండెచప్పుడు విన్నాను. చదువుకోవాలని తపన ఉన్నా..చదువుకోలేని పరిస్థితి చూశాం. ఇవాళ చదువు రాని వారి సంఖ్య 33 శాతం మంది ఉన్నారు. దేశంలో కేవలం 27 శాతం ఉందన్నారు. దేశం కంటే మన రాష్ట్రంలో 33 శాతం చదువు రావడం లేదు. ప్రతి అడుగులోనూ ఒక సవాలు ఉంది. పిల్లలను చదివించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి నా కళ్ల ఎదుటే చూశాను. మన పిల్లలు చదవాలి. చదువుల్లో కూడా వీరంతా రాణించాలి. ఇంగ్లీష్‌ మీడియం చాలా అవసరం. ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఈ రోజు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఇంగ్లీష్‌ రాకపోతే ప్రపంచంలో పోటీపడలేం. మన స్కూళ్లు అన్నీ కూడా  ఇంగ్లీష్‌ మీడియం చేయాలని ఆరాటపడితే..ఈ రోజు ఏం జరుగుతుందో చూస్తున్నాం. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో విద్యలో సమానత్వం

మీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు..
వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు ఇంగ్లీష్‌ మీడియం చేయాలని జీవో ఇస్తే..పేదవారికి ఇంగ్లీష్‌ మీడియం ఎందుకూ అని చంద్రబాబు లాంటి పెద్ద పెద్ద వాళ్లు, వెంకయ్యనాయుడు, పవన్‌ కళ్యాణ్‌ వంటి సినిమా యాక్టర్లు, వీరు సరిపోరన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజు పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు. మన పిల్లలు ఇంగ్లీష్‌ చదవగలిగితే మన పిల్లలకు మంచి చేయడం కాదా? ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడే వారు గుండెలపై చేతులు వేసుకోవాలి. ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. నీ కొడుకు చదివించింది ఏ మీడియం, నీ మనవడు చదివింది ఏ మీడియం, ఇదే మాటలు వెంకయ్య నాయుడి, పవన్‌ కళ్యాణ్‌ను కూడా అడుగుతున్నాను. పవన్‌ కళ్యాణ్‌కు కూడా ముగ్గురు భార్యలు, ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నారు. వారు ఏం చదువుతున్నారో అని అడుగుతున్నాను. మన పిల్లలకు చదువు చెప్పకపోతే దేశం నష్టపోతుంది. ప్రతి చదువు కోసం ఏ పేదింటిలో కూడా అప్పులపాలు రాకుండా ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తునే డిసెంబర్‌ నెలాఖరులో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మార్పు కోసం శ్రీకారం చుడుతున్నాం. నేడు స్కూళ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం. ప్రతి స్కూల్‌లోనూ బాత్‌రూం, నీళ్లు, బ్లాక్‌బోర్డు, పర్నీచర్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండాలి. ప్రతి స్కూల్‌కు పెయింటింగ్‌ ఉండాలి. ఆ స్కూల్‌కు వెళ్లే పిల్లలు మా స్కూల్‌ మంచిది అని రావాలి. ఇంగ్లీష్‌ మ్యాప్‌లు పెడతామని చెబుతున్నాను. రేపు సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం చేస్తూ , తెలుగు, ఉర్దూ బాషను తప్పని సరి చేస్తాం. మీడియం మాత్రం ఇంగ్లీష్‌ చేస్తాం. 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. తరువాత సంవత్సరం 7, ఆ తరువాత 8, 9, 10 ఇలా ఏటేటా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. 

పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏటా రూ.15 వేలు 
ఇవన్నీ ఒకవైపున చేస్తూ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. డిసెంబర్‌, జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం. దేశంలో ఎక్కడ జరగలేదు. ప్రతి తల్లికి ఒక్కటే చెబుతున్నాను. మీ పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు ఏడాదికి ప్రతి తల్లికి రూ.15 వేలు మీ తమ్ముడు, మీ అన్న మీ చేతుల్లో పెడతాడు. మన పిల్లలు గొప్పగా చదివితేనే మన ఆర్థిక పరిస్థితి మారుతుంది. స్కూళ్ల వద్ద నుంచి మొదలైతే రేపు హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పు రాబోతుంది. ఇవన్నీ కూడా ఉద్యోగానికి దగ్గరగా ఉండేందుకు మార్పులు తీసుకురాబోతున్నాం. ప్రతి ఏటా అప్రింటిషిప్‌ తీసుకువస్తాం. 

హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20వేలు 
గతంలో చాలీచాలన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది. మిగిలిన సొమ్ము కట్టలేక పిల్లలు స్కూళ్లు ఆపేశారు. ఇలాంటి పరిస్థితిని మార్పు చేస్తూ ఈ ఏడాది పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం. పిల్లలు కాలేజీకి వెళ్తే చాలు వారికి అయ్యే హాస్టల్‌, మెస్‌ ఖర్చుల కోసం రూ.20 వేలు ఆ తల్లి ఖాతాలో జమా చేస్తాం. కారణం ఆ పిల్లలు చదవాలి. చదువు అనే గొప్ప ఆస్తి ఈ ప్రభుత్వం వైయస్‌ జగనన్న ఇస్తున్నారని గొప్పగా చెబుతున్నాను. గొప్పగా మన పిల్లలు అభివృద్ధి చెందాలని, దేవుడు ఆశీర్వదిస్తారని, మీ అందరి చల్లని దీవెనలతో నమ్ముతున్నాను.

మదర్సా బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు
మన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఇక్కడికి వచ్చే ముందు అన్నా..మదర్సాల గురించి ఆలోచించాలని కోరారు. ఇందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అక్కడి పిల్లలకు కూడా మోడ్రన్‌ ఎడ్యుకేషన్‌ తీసుకురావాలి. ఉర్దూ, ఖురాన్‌లో రాణిస్తునే మరో వైపు ఇంగ్లీష్‌ చదువులు చదివేలా రెండు బ్యాలెన్స్‌ చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని వాళ్ల వద్దకు కూడా తీసుకువెళ్తాం. 

మార్చి నుంచి వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక
గతంలో పెళ్లి కానుక చంద్రబాబు పెట్టారు. ఈ పథకం ఆగిపోయింది. నవంబర్‌ 2018 నుంచి ఈ పథకం తెరమరుగు అయ్యింది. చంద్రబాబు పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక తీసుకువస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికంటే వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక రెట్టింపు చేస్తూ రూ.1 లక్ష ఇస్తాం. మౌజమ్‌, మౌలానాలకు గౌరవవేతనాలు పెంచి ఇస్తాం. దీనికి కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. మసీదుల సంఖ్య పెంచుతాం. ఇస్తామన్న రూ.15 వేలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో విద్యలో సమానత్వం

తాజా ఫోటోలు

Back to Top