మనమంతా ప్రజా సేవకులం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

జగన్‌ అనే నేను.. తోడుగా ఉంటాను

పరిపాలన ప్రతి గడపకు తీసుకెళ్లడమే లక్ష్యం

ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తాం

మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే గ్రామ సచివాలయాల వ్యవస్థ

తక్కువ సమయంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డు

2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తిసేవలు

72 గంటల్లోనే సమస్యలను పరిష్కరిస్తాం

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన ప్రయత్నమే ఈ వ్యవస్థ

ఆస్పత్రుల స్థితిగతులు మార్చి మెరుగైన వైద్యం అందిస్తాం

పిల్లలు పనికి కాదు.. బడిబాట పట్టేందుకు అమ్మఒడి పథకం

రైతన్నకు ప్రభుత్వం అండగా ఉంటుంది

కాకికాడ: దేశ చరిత్రలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ సొంతమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ప్రజాసేవకులమే అని గుర్తించుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..ముఖ్యమంత్రి మాటల్లోనే..

ఈరోజు మహాత్ముడి 150వ జయంతి. గాంధీజీ పేరు మన మనసుకు ఎప్పుడైన వస్తే..మనకు గుర్తుకు వచ్చే పదాలు..అహింస, సత్యాగ్రహం గుర్తుకు వస్తాయి. ఈ రెండు పదాలతో బ్రిటీష్‌ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఇది మనందరికి తెలిసిన విషయం. మహాత్ముడు గాంధీజీ అన్న మాటలు..మన భారతీయ ఆత్మ అంతా కూడా మన గ్రామాల్లోనే ఉందని చెప్పారు. మన గ్రామాలు ఏ రోజు అయితే లేకుండా పోతాయో..ఆ రోజున భారత దేశమే లేకుండా పోతుందని మహత్ముడు అన్నారు. అటువంటి గ్రామాలను అన్ని విధాలుగా తీర్చిదిద్ది..పరిపాలన ప్రతి గడప వద్దకు తీసుకుపోవాలనే తపన, ఆరాటంతో దేశంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈ రోజు అంకురార్పణ చేశాం. రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది, ఎక్కడా జరగనిది. ప్రతి 2 వేల జనాభాకు 10 నుంచి 13 ప్రభుత్వ కొత్త ఉద్యోగాలు రావడం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు.

వ్యవస్థలోకి మార్పు తీసుకువచ్చే విధంగా పరిపాలనలో అవినీతి ఎక్కడా లేకుండా చేయాలనే తపనతో, విపక్షకు తావులేకుండా చేసిన ప్రయత్నమే ఈ గ్రామ సచివాలయం. ప్రతి గ్రామంలో 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా...ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాం. ఈ నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన రాష్ట్రంలోనే ఉంది. ఇదే జిల్లాలోనే దాదాపుగా 1271 గ్రామ సచివాలయాలు, పట్టణ సచివాలయాలతో కలిపితే 1587 సచివాలయాలు,  మొత్తం 13640 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటే ఈ ఒక్క జిల్లాలోనే  44, 198 ఉద్యోగాలు ఇవ్వగలిగామంటే ఇదో చరిత్ర అని గట్టిగా చెబుతున్నాను. దాదాపుగా 35 శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1వ తేదీకల్లా పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామ సచివాలయాల్లో ఇంకా వసతులు అన్ని కూడా రెండు నెలల కాలంలోనే పూర్తిగా ఏర్పాటు చేస్తాం. డిసెంబర్‌ మాసంలోగా పూర్తి సమస్యలు అన్ని కూడా అధిగమిస్తాం. జనవరి 1వ తేదీ కల్లా పూర్తిగా గ్రామ సచివాలయాల్లో అన్ని పనులకు ప్రతి పేదవాడికి అందిస్తామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి గ్రామ వాలంటీర్లకు స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తాం. ఆ ఇళ్లకు వాలంటీర్‌ పెద్ద కొడుకుగా ఉంటాడు. గ్రామ సచివాలయాలతో అనుసంధానమై..ప్రతి గ్రామంలో కూడా ఏ సేవ అయినా కూడా పూర్తిగా, పారదర్శకంగా, వివక్షకు తావు లేకుండా, అవినీతి అన్న పదాన్ని దూరం పెడుతూ సేవలందిస్తారు.

నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో గ్రామ పరిస్థితులను దగ్గర నుంచి చూశాను. అక్కడ అసలు ప్రభుత్వమే లేదు అన్నది చూశాను. మంచినీళ్లు, మంచి పని, మంచి వైద్యం ఉండాలని గ్రామీణులు ఆశీస్తారు. ఇవేవి కూడా గ్రామాల్లో లేవు. రేషన్‌ బియ్యం కూడా నాసిరకంగా ఇస్తున్నారు. వేలిముద్రలు పడటం లేదని రేషన్‌లో కొత విధించారు. రేషన్‌కార్డు, ఇళ్ల స్థలం, ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మరుగుదొడ్డి కావాలన్నా లంచం అడిగారు. జన్మభూమి కమిటీల్లో వారు మీరు ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశ్నించే వారు. ఇటువంటి పరిస్థితిలో వాళ్లకు ఏదైనా కార్డు కావాలాంటే అగమ్యగోచరంగా అందరి చుట్టూ తిరిగారు. కార్యాలయాల చుట్టూ తిరిగారు. చివరకు కాళ్లు అరిగినా పనులు జరగలేదు. ఇవన్నీ కూడా నా పాదయాత్రలో చూశాను. ఇటువంటి పరిస్థితులను మార్చాలి. ఎవరికైనా కూడా అర్హత ఉంటే చాలు ప్రతి ఇంటికి ఆ పథకం చేర్చాలన్న తపన గుర్తుకు వచ్చాయి. అందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాం.

ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనైనా సరే..ఏ పథకమైనా సరే వెంటనే మంజూరు చేస్తాం. గ్రామ సచివాలయం పక్కనే ఎరువులు, విత్తనాల షాపు కూడా ఏర్పాటు చేస్తాం. వ్యవసాయంలో వర్క్‌షాపు పెట్టి ప్రతి గ్రామంలో కూడా తర్పీద్‌ ఇస్తాం. అక్వారంగానికి సంబంధించిన వర్క్‌ షాపు ఏర్పాటు చేస్తాం. అమ్ముడుపోయే ఫెస్టిసైడ్స్‌ అందుబాటులోకి తెస్తాం. గ్రామాల్లో బతికే వాళ్ల పరిస్థితిని పూర్తిగా మార్చేదిశగా అడుగులు వేస్తాం.  ప్రభుత్వ పథకం కూడా మన ఇంటి వద్దకే వస్తుంది. నేరుగా తలుపులు తట్టి డోర్‌ డెలివరీ చేస్తారని గర్వంగా చెబుతున్నాను. గతంలో మాదిరిగా తిరగాల్సిన పని లేదు. ఎవరికి కూడా వివక్ష ఉండదని చెబుతున్నాను. రెండు నెలల టైం అడుగుతున్నాను. ఈ రెండు నెలల తరువాత పూర్తిగా గ్రామ సచివాలయాలు నెలకొల్పుతాం. అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. అర్హత ఉన్న వారికి అందరికి కూడా పథకాలు అందజేస్తాం. 72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అందజేస్తాం.

గ్రామ వ్యవస్థ గానీ, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ గానీ ప్రజలపై రాజ్యాధికారం చెలాయించడం కోసం పెట్టినవి కావు. మనం ప్రజల మీద అధికారం చెలాయించడం కాదు.  అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మనమంతా కూడా ప్రజలకు సేవకులమని గుర్తు పెట్టుకోవాలి. ఈ వ్యవస్థలు మనం తీసుకువచ్చింది ఎందుకంటే..గత ప్రభుత్వం చేసిన తప్పులు మన ప్రభుత్వంలో సరిదిద్దేందుకే తీసుకువచ్చామని కోరుతున్నాను. మన వ్యవస్థ ఎంత పటిష్టంగా జరగాలంటే..నిరుడు ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా మన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మన పాలన ఉండాలని గుర్తించుకోవాలి. కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఏర్పాటు చేశాం. అది నేరుగా సీఎం ఫెసీకి కనెక్ట్‌ అవుతుంది. ఎవరైనా కాల్‌ చేస్తే చాలు స్పందిస్తాం. గ్రామ వాలంటీర్లుగా ఉన్న నా సొంత తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని సవివరంగా కోరుతున్నాను. మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగు కోరుతూ మరి కొన్ని కార్యక్రమాలు నాలుగు నెలల్లో చేపట్టాం. మన గ్రామాల్లో స్కూళ్లున్నాయి. ప్రతి గ్రామంలోని స్కూల్‌ ఫోటోలు తీయండి. నాడు- నేడు ఫోటోలు చూపించి అభివృద్ధిని చూపిద్దాం. మరుగుదొడ్లకు నీరు రాని పరిస్థితి, కాంపౌండు లేని పరిస్థితి, సున్నాలు లేని పరిస్థితిని మార్చుదాం. గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థలు క్రీయశీలంగా పని చేయాలి.

ఏడాదికి 15000 స్కూళ్లను మార్చేద్దాం. మన గ్రామంలో ఉన్న పీహెచ్‌సీ సెంటర్‌ నుంచి కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు కూడా మార్పు తీసుకువద్దాం. చంద్రబాబు హయాంలో ఎలా జరిగాయో అందరికి తెలుసు. ఎలుకలు కొరికితే చంటి పిల్లలు చనిపోయారు.సెల్‌ ఫోన్లతో ఆపరేషన్లు చేసిన పరిస్థితి చూశాం. మూడేళ్లలో ఈ పరిస్థితులను మార్చుదాం. హాస్పిటల్స్‌ పరిస్థితిపై కూడా నాడు-నేడు ఫోటోలు తీసి మార్చివేద్దాం. పిల్లల చదువులు, ఆరోగ్యంపై కూడా దృష్టి పెడదాం. జనవరి 26వ తేదీ నాటికి అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుదాం. జగన్‌ అనే నేను  ఇదే వేదికపై నుంచి అడుగుతాను..చదువురాని వారు ఎవరూ కూడా ఉండకూడదు. తల్లులు తమ బిడ్డలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేస్తాం. పిల్లలను బడిబాట పట్టించే కార్యక్రమం చేస్తామని గర్వంగా చెబుతున్నాను. రైతులు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. గ్రామ సెక్రటేరియట్‌ను నెలకొల్పిన కొద్ది రోజులకే ఈ నెల 15న వైఎస్సార్‌ రైతు భరోసా పేరుతో రైతులకు తోడుగా ఉంటాం. ప్రతి రైతుకు రూ.12,500  ఇస్తామని చెబుతున్నాను. గ్రామ సచివాలయాలు, గ్రామవాలంటీర్‌ వ్యవస్థలో అవినీతి అన్నది ఎక్కడా ఉండదు. అక్టోబర్‌ 4న ఆటో, కారు డ్రైవర్‌కు వైయస్‌ జగన్‌ తోడుగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి అక్షరాల 4.72 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జమా చేస్తాం. ఇందులో ఎక్కడా అవినీతి అన్నది తావు లేకుండా చేస్తున్నాం.

వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తీసుకువస్తాం. గాంధీ జయంతి రోజున మద్యం షాపుల గురించి చెప్పక తప్పుదు. అక్షరాలు అప్పట్లో 4500 షాపులు ఉండేవి, వీటికి అనుసంధానంగా ప్రతి గ్రామంలోనూ 43 వేల బెల్టుషాపులు ఉండేవి. గతంలో గ్రామంలో మినరల్‌ వాటర్‌ ఉందో లేదో తెలియదు కానీ, మద్యం షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండేది. ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. ఏ గ్రామంలో కూడా బెల్టుషాపులు రద్దు చేయడమే కాదు..ప్రభుత్వమే మద్యం దుకాణాలు నేరుగా నడిపిస్తోంది. బెల్టుషాపులు ఎక్కడా లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్‌షాపులను తీసేసి ప్రభుత్వమే మందుల షాపులు నడుపుతోంది. ప్రస్తుతం 3400 షాపులకు కుదించాం. ఏ దిశగా అడుగులు వేస్తున్నామో ఆలోచన చేయండి. పర్మిట్‌షాపులను కూడా రద్దు చేశాం. టైమింగ్‌ కూడా మార్చేశాం. మధ్యాహ్నం 11 గంటలకు తెరిసి..రాత్రి 8 గంటలకే మూసేస్తాం. ప్రతి గ్రామంలోను అక్కచెల్లెమ్మలను మహిళా పోలీసులుగా తీసుకువచ్చాం. వాళ్లకు ఇచ్చిన ఒక పెద్ద బాధ్యత ఏంటో తెలుసా? గ్రామాల్లో ఎక్కడైనా బెల్టుషాపులు కనిపిస్తే చాలు ఒక ఫోన్‌ కొడితే ప్రభుత్వం కదులుతుంది. రైతులకు, రైతు కూలీలకు ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది.

వైద్యానికి హామీగా ప్రభుత్వం ఉంటుంది. పేదలకు ఉగాది నాటికి దాదాపుగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని గర్వంగా చెబుతున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటేడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు తెస్తూ చట్టం చేశాం. ఈ ఒక్కరోజే నాలుగు నెలలు తీరుగకముందే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రజల బాటను ఈ ప్రభుత్వం ఎన్నడు కూడా మరువదని చెబుతున్నాను. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఎటువంటి రెకమొండెషన్‌ లేకుండా, ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఉద్యోగం ఇచ్చామంటే ఈ ప్రభుత్వ పనితీరును గుర్తు పెట్టుకోవాలని, ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై మీ అందరి చల్లని దీవెనలే కారణమని గర్వంగా చెబుతున్నాను. నా తమ్ముళ్లు, నా చెల్లెమ్మలకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top