ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై సీఎం సీరియస్‌

జీఓ రద్దు చేయాలని ఆదేశం
 

అమరావతి: ప్రతిభా పురస్కారాలకు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు మార్పుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చుతూ జీవో విడుదలపై సీరియస్‌ అయ్యారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ విడుదలైన జీవోను రద్దుచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. యధాతధంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. దీంతోపాటు దేశంలో మహనీయుల పేర్లుకూడా అవార్డులకు పెట్టాలని, మహాత్మాగాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.

 

Read Also: మళ్లీ అవే ఏడుపులు

తాజా ఫోటోలు

Back to Top