జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్  సందేశం

ముస్లిం సోద‌రుల‌కు సీఎం వైయ‌స్ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు
 

 అమరావతి : పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  పవిత్రమైన బక్రీద్‌ పర్వదినాన్ని(ఆగస్టు 01) పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అన్నారు.  దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top