ప్రధాని మోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ప్రధానితో భేటీ అయిన సీఎం.. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు.  
 
మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.

Back to Top