అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్‌బర్న్ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులను సీఎం వైయస్ జగన్ వారికి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు వెల్లడించారు.