26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలి 

పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో  పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యుల నియామ‌కం

తాడేప‌ల్లి: అక్టోబ‌ర్ 26వ తేదీ నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌ను ఆదేశించారు.  పార్టీ ప్రతినిధులు సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో పార్టీ  ప్రాంతీయ సమన్వయ కర్తలతో   ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్ స‌మావేశ‌మ‌య్యారు.
 
 సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించిన  వైయస్‌.జగన్‌. 

 బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

దసరా పండుగ నేపథ్యంలో, పండుగ ముగించుకుని అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలి:
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరగాలి:
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలి:
ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం,  అత్యంత విజయవంతంగా మీటింగులు జరిగేలా చూడాలి:
స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలి:

52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలి:
వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం : 
జరుగుతున్నది కులాల వార్‌ కాదు, ఇది క్లాస్‌ వార్‌:
పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకోవాలి: 
వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలి:
నియోజకవర్గాల వారీగా సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి:
సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలి:

విజయవాడ పార్టీ ప్రతినిధులు సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై
నియోజకవర్గాల స్థాయిలో అవగాహన కల్పించాలి:
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశంలో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలి:

జగనన్న ఆరోగ్య  సురక్ష  క్యాంపులను రీజినల్  కో-ఆర్డినేటర్లు సందర్శించాలి:
ఎమ్మెల్యేలతో కలిసి.. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలి: సీఎం   వైయస్‌.జగన్‌.

కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,  వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి,  మర్రి రాజశేఖర్‌, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్‌, లేళ్ల అప్పిరెడ్డి.

Back to Top