తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. ప్ర‌త్యేక విమానంలో తిరుప‌తికి బ‌య‌ల్దేరారు. మ‌రికాసేప‌ట్లో రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు వెళ్తారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం.. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన‌ సొమ్ము జమ చేస్తారు. అక్క‌డి నుంచి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకొని భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంత‌రం కేన్సర్‌ కేర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.

Back to Top