వైయస్‌ఆర్ జిల్లా: వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.515.90 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 163 కోట్లతో ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు, రూ.119 కోట్లతో నూతన మంచినీటి పైపులైన్ నిర్మాణానికి, రూ.50.90 కోట్లతో నూతన కూరగాయల మార్కెట్ కోసం, రూ. 53 కోట్లతో పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి, రూ.20.50 కోట్లతో ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు, రూ.4.5 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు, రూ. 66 కోట్లతో యోగి వేమన ఇంజినీరింగ్ కాలేజీ మౌలిక వసతుల కోసం, ఎస్‌సీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపనలు చేశారు.