ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గంట‌న్న‌ర‌పాటు కొన‌సాగనున్న సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలు

విశాఖ‌: ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్రారంభించారు. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్‌ వీక్షిస్తున్నారు. సుమారు గంటన్నరపాటు ఈ విన్యాసాలు కొన‌సాగ‌నున్నాయి. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొన్నారు. భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

Back to Top