అక్కా..చెల్లెమ్మా..నేనున్నా

చేనేతల పరిస్థితులు నాకు తెలుసు

మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేలు ఆర్థికసాయం

నేతన్న కుటుంబాలు గౌరవంగా జీవించేందుకు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం

బీసీలు అంటే బ్యాక్‌ బోన్‌ క్లాసులని తలెత్తుకునేలా చేస్తాం

వచ్చే ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు

రైతన్నలకు అండగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా అందిస్తున్నాం

వాహనమిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేశాం

ఐదేళ్లుగా న్యాయం జరగని అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా కల్పించాం

మత్స్యకారులకు భరోసా  ఇచ్చాం

జనవరి 9 నాటికి అమ్మ ఒడి ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు సాయం

ధర్మవరం సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అనంతపురం: చేనేతల కష్టాలను కళ్లారా చూశానని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.24 వేల చొప్పున మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి..అక్కా..చెల్లెమ్మా నేనున్నానని తలుపు తట్టి గడప వద్దకే వచ్చి మీ ఖాతాల్లో డబ్బులు జమా చేస్తామని సీఎం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఇక్కడికి వచ్చిన నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు, వేదికపై ఉన్న నా సహచరులు, అధికారులకు అందరికి నా హృదయపూర్వక అభినందనలు. తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టాం.  ధర్మవరంలో నేతన్నల పరిస్థితి గురించి, నేతన్నలు పడుతున్న అగచాట్ల గురంచి నాకన్న ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే పక్కనే పులివెందుల నియోజకవర్గం. నేతలకు ఎప్పుడు ఏం జరిగినా కూడా ఇక్కడికి వచ్చింది..నిరాహారదీక్షలు చేసింది..నేతన్నలకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చింది ఒక్క వైయస్‌ జగన్‌ తప్ప మరో నేత లేడు. అగ్గిపెట్టెలో పెట్టే వస్త్రాల నుంచి నేతన్నల గురించి చెప్పుకోవాల్సి వస్తే..వీరి చేతి నైపుణ్యం నుంచి మన జాతీయ ఉద్యమం దాకా కూడా నేతన్నలు పాలుపంచుకున్న విధానం గురించి గర్వంగా చెప్పుకోవచ్చు.  మన దేశానికే చెప్పుకునేందుకు ఇక్కడి బట్టలు, ఇక్కడి నైపుణ్యాన్ని ప్రపంచమంతా చెప్పుకుంటారు. మన బాధలను ఎప్పుడు, ఎక్కడా చెప్పునేది చూడలేదు. ఇబ్బందులు నా కళ్ల ముందే చూశాను. సబ్సిడీ రాక అవస్థలు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరు పట్టించుకోకపోతే గళం విప్పి గట్టిగా అడిగాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులో చేనేతలు పడిన కష్టాలు చూశాను. ధర్మవరం, వెంకటగిరి,మంగళగిరి, చీరాల, ప్రోద్దుటూరు, జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, ఉప్పాడ, తిప్ప సముద్రం, పొందూరు అయితేనేమి ఎక్కడా చూసినా కూడా చేనేతల పరిస్థితి ఏమిటి అంటే...పేదరికంలో ఉండటం, అప్పుల్లో కూరుకుపోవడం. ఇది వారి జీవితగాథలు, ఆత్మహత్యలు చేసుకున్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్కో అన్న వ్యవస్థను స్కాముల మయం చేశారు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. పచ్చచొక్కాలు దోచుకున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఆప్కో వ్యవస్థను పూర్తిగా క్లీన్‌ చేస్తాం. చేనేతలకు మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాను. చేనేతలకు ఒక్క అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని మాటిచ్చాను. ఆ రోజు పాదయాత్రలో నేను మీ కష్టాన్ని చూశాను. మీ బాధలు విన్నాను. ఆ రోజు నేను ఉన్నాను..నేను ఉన్నానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని  మేనిఫెస్టోలో హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నానని సగర్వంగా ఈ వేదిక నుంచి చెబుతున్నాను. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా రూ.24 వేలు అందిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ..రాష్ట్రంలో మగ్గం ఉన్న 85 వేల కుటుంబాలకు ఈ సహాయాన్ని అందిస్తున్నాం. ఈ డబ్బులు ఈ రోజు నా మీటింగ్‌ అయిపోయిన తరువాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన వెంటనే 85 వేల చేనేత కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమా అవుతుంది. అంతేకాకుండా ఈ సొమ్మును బ్యాంకులు మీ పాత అప్పులకు జమా చేసుకోకుండా అధికారులతో మాట్లాడం. అక్షరాల ఐదేళ్లలో చేనేత కుటుంబానికి తలుపు కొట్టి అక్కా నేనున్నానని, చెల్లెమ్మ నేనున్నాని గడప వద్దకు వచ్చి రూ.1.20 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమా చేస్తున్నాం. ఈ సొమ్ము ప్రతి చేనేత కుటుంబానికి వారికి స్థితిగతులు మార్చేందుకు  ఉపయోగపడుతుంది. నేతన్నలు గౌరవంగా జీవించేందుకు ఈ సహాయం గొప్పగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. బీసీలంటే వెనుకబడిన కుటుంబాలుగా మిలిగిపోవడానికి వీల్లేదని, బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌లని ..అంటే మన కులాలకు వెన్నుముకలా తలెత్తుకునేలా చేస్తానని ఏలూరులో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ప్రతి అడుగు వేస్తున్నాను.  నేతన్న నేస్తం ఒక్కటే కాదు..ఈ సమాజంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలు అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతు భరోసా అన్న పథకాన్ని తీసుకువచ్చి ప్రతి రైతుకు అన్నా..తోడుగా మీ తమ్ముడు ఉన్నాడని సగర్వంగా చెబుతున్నాను. 25 లక్షల పేదలకు ఈ ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నానని సగర్వంగా చెబుతున్నాను. జనవరి నెల 9న అమ్మ ఒడి పథకాన్ని తీసుకువస్తున్నాం. ప్రతి చెల్లెమ్మకు ఈ అన్న ఉన్నాడని, మీ పిల్లలకు మీ మామ చదివిస్తాడని చెప్పండి. జనవరి 9న అమ్మ ఒడికి శ్రీకారం చుడుతున్నామని చెబుతున్నాను. ఆరు నెలలు తిరుగకముందే..పేదరికంలో ఉన్న ట్రాక్సీ, ఆటో డ్రైవర్లకు తోడుగా నిలిచాం. ఆగ్రిగోల్డు బాధితుల బాధలు చూసి ఏ ఒక్కరు స్పందించకపోతే..బాధితులకు భరోసా కల్పిస్తూ..వారందరికీ ఈ అన్న తోడుగా ఉన్నాడని సగర్వంగా చెబుతున్నాను. 
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు తోడుగా ఉన్నానని ఆరు నెలల్లోనే చేసి చూపించాం. గతంలో అవ్వతాతలకు ఇచ్చే పింఛన్లు రూ.500 కోట్లు ఉంటే..ఈ రోజు మన ప్రభుత్వంలో పింఛన్లు నెలకు రూ.1500 కోట్లు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశాం. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి. సచివాలయాలకు అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఆరు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. లక్ష 30 వేల మందికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం.  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 81.5 శాతం ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి  ఒక్క పథకం పేదవారికి అండగా నిలిచేందుకు కార్యక్రమాలు రూపొందించాం. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరగని విధంగా మంత్రి మండలిలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చాం. ఇంకో అడుగు ముందుకు వేశాం. ఐదుగురికి డిప్యూటీసీఎం పదవులు ఇస్తే..వీరిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ప్రతి అడుగులోనూ ఒక సామాజిక విప్లవం తీసుకువచ్చాం.  ఆరు నెలలు తిరుగకమునుపే నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చేందుకు శాసన సభలో చట్టం చేశాం. 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మీ అన్న..మీ తమ్ముడి ప్రభుత్వం. మీ అందరికి కోరేది ఒక్కటే. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం జరగాలని,  అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని,  ఒక ప్రభుత్వ పథకం ప్రవేశపెడితే ఒక గ్రామం ఎంత మారుమూలదైనా కూడా అక్కడి ప్రజలకు ఆ పథకాలు అందాలి. ఆ సమయంలో వివక్ష ఉండకూడదు, అర్హులందరికీ కూడా సాచ్యూరేషన్‌ పద్ధతిలో పిలిచి, బొట్టుపెట్టి ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ అవినీతి లేకుండా ముందుకువెళ్తున్నాం. కమీషన్లకు తావు లేకుండా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్తున్నాం. జ్యూడిషియల్‌ కమిటీ ఏర్పాటు చేశాం, ఏసీబీకి ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌తో కలయిక చేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా ఏపార్టీ, ఏ కులం, మతం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఇంతా బాగా చేస్తున్నా కూడా ఇవాళ జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నారు. శత్రువులు ఏం మాట్లాడుతున్నారో మీ అందరూ చూశారు. నా బలం మీ ఆశీస్సులు, దేవుడి దయ అని చెబుతున్నాను. మీ చల్లని దీవెనలు, ఆ దేవుడి దయతో ఇంతకన్న గొప్పగా చేసేలా మీ తమ్ముడిగా, మీ బిడ్డగా  ..మీ ఇంటి సభ్యుడిగా ఉండాలని, మీ అందరి చల్లని ప్రార్థనలు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..

Back to Top