భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సహకారం చేస్తూ  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎయిర్‌పోర్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.23.73 కోట్లతో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం రాజన్న దొర, అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు,  అధికారులు ఉన్నారు. 
 

Back to Top