గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

తాడేపల్లి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహనరెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థకు గురైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే విశాఖ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌ జగన్‌ అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై సమీక్ష చేపడుతున్నారు. ఘటన జరిగిన చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 
 

Back to Top