చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పం నియోజకవర్గానికి వచ్చిన సీఎం వైయస్ జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. పాతపేటలో హెలీప్యాడ్ వద్ద సీఎం వైయస్ జగన్‌కు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.