సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కూతురుకు ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు

 హర్షారెడ్డిని పారిస్‌ పంపేందుకు 25న బెంగళూరుకు సీఎం వైయ‌స్‌‌ జగన్‌

తాడేప‌ల్లి: త‌ండ్రికి త‌గ్గ త‌న‌య‌గా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూతురు హ‌ర్షారెడ్డి ఘ‌న‌త సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద కూతురు సీటు సాధించింది.  త‌న కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైయ‌స్‌ జగన్ ఈ నెల 25వ తేదీన బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26వ తేదీ కూడా అక్కడే ఉంటారు. 27న తాడేపల్లి నివాసానికి తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఇన్సీడ్‌ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్‌ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయడానికి మొగ్గుచూపారు.  

తాజా వీడియోలు

Back to Top