ఆ చిన్నారుల కన్నీరు తుడిచిన సీఎం

ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందజేత

తిరుపతి: ఆ చిన్నారుల ఆవేదన విని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చలించిపోయారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు మంజూరు చేయడమే కాకుండా చిన్నారుల చదువుల కోసం మరో రూ. 5 లక్షలు కేటాయించి వారి కన్నీరు తుడిచారు. వివరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి వస్తున్నారని తెలిసి తమ బాధను చెప్పుకునేందుకు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చాందినీ, రంజని అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు గ్యాలరీలో సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి.. తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నారు. ‘మా అన్న హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్‌ 21న స్కూల్‌ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి’.. అని చాందినీ, రంజని సీఎంను కోరారు. వారి ఆవేదన విని చలించిపోయిన సీఎ వైయస్‌ జగన్‌ చిన్నారులను ఓదార్చి.. హరికృష్ణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆ పిల్లల చదువులకు మరో రూ. 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఆదేశించారు.
 

Back to Top