ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.. కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా బతుకుతా

నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాజకీయ నాయకుడు అంటే.. ప్రజలకు సేవకుడు

మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 98.4 శాతం ఇప్పటికే నెరవేర్చాం

ఫొటోషూట్లు, డ్రోన్‌షాట్ల కోసం చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడు

అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లపై దుష్టచతుష్టయం విషప్రచారం

జనవరి నుంచి పెన్షన్‌ రూ.2750కి పెంచడం ఓర్వలేక బురదజల్లుతున్నారు

చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పనైనా జరిగిందా..?

ఏం మంచి చేశాడని చంద్రబాబు సభలకు జనం వస్తారు..?

బాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకాలు రెండు.. ఒకటి వెన్నుపోటు, రెండు మోసాలు

రాష్ట్రంలో ఏమంచి జరిగినా తనవల్లేనని చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటాడు

ఆఖరికి పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ నేర్పింది కూడా తానేనని బాబు గొప్పలు

చంద్రబాబు చేసిన పాపంలో దత్తపుత్రుడికి వాటా ఉంది..

దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాడు

రాజ‌కీయం అంటే అధికారం చెలాయించ‌డం కాదు.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం

అనకాపల్లి: ‘‘జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే.. ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్‌ ఎగరేసుకొని ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తున్నాడు.. మీ జగనన్న బతుకుతాడు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం.. ఇదే మీ జగనన్న ప్రభుత్వం.. ఇదే మనందరి ప్రభుత్వ విధానం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నర్సీపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నర్సీపట్నం గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఆలోచించాల్సిందిగా ప్రజలను కోరుతూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. 

నాలుగు మాటలు రాష్ట్ర రాజకీయాల గురించి..
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూడమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మనందరికి రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతుంది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఎల్లో మీడియా పనిచేస్తోంది. ఎల్లో మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తోంది. తమకు అనుకూలంగా వ్యక్తిని ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఎల్లో మీడియా పనిచేస్తోంది. ఇలాంటి దారుణమైన చెడిపోయి ఉన్న దారుణమైన రాజకీయ వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. మనం మంచి చేస్తున్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తోంది. 

ఉదాహరణకు.. మనం రెండు రోజుల్లో పింఛన్లు పెంచబోతున్నాం. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సామాజిక పింఛన్లు అన్నీ కూడా రూ.2750కి పెంచబోతున్నాం. దీన్ని చూసి కూడా ఓర్వలేని తనం దుష్టచతుష్టయంలో కనిపిస్తోంది. ఈ దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ, చంద్రబాబు, దత్తపుత్రుడు. జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు మంచిచేస్తూ పెన్షన్‌ పెంచబోతున్నాడనే గొప్ప కార్యక్రమంలో కూడా అసత్య ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి ఆరునెలలకు (జూన్, డిసెంబర్‌) మామూలుగానే ఆడిట్లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్‌ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది. వెరిఫికేషన్‌ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక్క కార్యక్రమంలో ఎల్లో మీడియా ఎన్నెన్ని అబద్ధాలు సృష్టించారు.. ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. 

గతంలో చంద్రబాబు హయాంలో 2018 అక్టోబర్‌ (ఎన్నికలకు ఆరు నెలల వరకు) వరకు ఎంత మందికి పింఛన్లు ఇచ్చారంటే.. కేవలం 39 లక్షలు. ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో అక్షరాల 62.30 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడ 39 లక్షలు.. ఎక్కడ 62.30 లక్షలు. మీ జగనన్న మనసు ఎలాంటిదంటే.. రేపు జనవరి 1న 62.30 లక్షల పెన్షన్లు పెరిగేవే కానీ, తగ్గేవి ఉండదు అని అందరికీ తెలుసు. కారణం మీ జగనన్న మనసు అలాంటిది. ఏరకంగా అబద్ధాలు చెబుతున్నారో చూడండి.. 

చంద్రబాబు హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం రూ.400 కోట్లు అయితే.. మన ప్రభుత్వంలో, మీ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లు నెలకు ఏకంగా రూ.1700 కోట్లకు చేరింది. తేడా ఇంత ప్రస్పుటంగా కనిపిస్తున్నా కూడా ఏరకంగా ఎల్లో మీడియా అల్లకల్లోలం చేస్తుందో ఒక్కసారి గమనించండి. 

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటాడు. చంద్రబాబు పరిపాలనలో ఒక్క మంచి అయినా చేశాడా..? చెప్పుకోవడానికి ఆధారాలు ఉన్నాయా..? అని అడుగుతున్నాను. కనీసం ఇప్పటికైనా వారికి అర్థం అవుతుందేమో.. మాటలు మాట్లాడేటప్పుడు కాస్తయినా నిజం ఉండాలని.. ఇలాంటి దత్తతండ్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాడు.. దత్తపుత్రుడు. వీరిద్దరి సై్టల్‌ ఒక్కటే.. ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే.. ఆ రాష్ట్ర ప్రజలు, ఈ పార్టీ కాకపోతే.. ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే.. ఆ భార్యతో.. ఇవి వీరి సై్టల్‌. వీరి స్వరూపం చేస్తూ ఎవరికైనా ఏమనిపిస్తుదంటే.. ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపిస్తోంది. 

ఒకాయన రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయ్యింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీచేస్తే.. ప్రజలు ఓడించారు. ఈయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు. బాబు ఎప్పుడు షూటింగ్‌ అంటే అప్పుడు ఈయన కాల్‌షీట్‌ ఇస్తాడు.  ఎక్కడ షూటింగ్‌ అంటే అక్కడకు వస్తాడు. బాబు స్క్రిప్టు ఇస్తాడు.. బాబు చెప్పిన డైలాగ్‌లు అన్నీ యాక్ట్‌ చేసి చూపిస్తాడు. ఇది ఈయన సై్టల్‌. 

మరో వ్యక్తి చంద్రబాబు సై్టల్‌.. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు. 14 ఏళ్లుగా సీఎం పదవి చేశానని చెప్పుకుంటాడు. ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను.. తన వల్లే జరిగిందని అంటాడు. చివరకు సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా కూడా సింధూకు బ్యాడ్మింటన్‌ ఆడటం నేనే నేర్పించానని అంటాడు. ఈ పెద్ద మనిషి సై్టల్‌ ఇది. కానీ, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్లు ఉండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ కూడా మనం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ కూడా వచ్చింది. చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్‌ కూడా గుర్తుకు రాదు. 14 ఏళ్లు సీఎం అని మళ్లీ గొప్పలు చెప్పుకుంటాడు. 

73 సంవత్సరాల ముసలాయనను చూస్తే గుర్తుకువచ్చేది కేవలం రెండే రెండు స్కీమ్‌లు.. ఒకటి వెన్నుపోటు, రెండు మోసాలు. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేది ఈ రెండే. ఈ మధ్యకాలంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి. ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించడానికి దుష్టచతుష్టయం నానా తంటాలు పడుతున్నారు. అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ప్రతీ ఒక్క వర్గాన్ని కూడా వంచించిన బాబు సభకు అసలు జనం ఎందుకు వస్తారు అని ఆలోచన చేయండి. 

– బాబూ బాబూ.. మాకు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి.. చివరకు మమ్మల్ని నిండా మోసం చేసినందుకు థ్యాంక్యూ బాబూ అని రైతులు ఏమైనా ఆయన సభలకు వస్తారా అని అడుగుతున్నా.. 

– బాబూ బాబూ.. మాకు 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి.. వడ్డీలు కూడా కట్టొద్దని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఎగ్గొట్టినందుకు పొదుపు సంఘాలను సర్వనాశనం చేసినందుకు ఆ అక్కచెల్లెమ్మలందరూ థ్యాంక్యూ థ్యాంక్యూ బాబూ అని ఆ అక్కచెల్లెమ్మలు బాబు సభలకు వస్తారా అని ఆలోచన చేయండి. 

– బాబూ బాబూ.. మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్యూ బాబూ అని ఇంటికో ఉద్యోగం ఇస్తాను.. ఉద్యోగం ఇవ్వలేకపోతే.. ఇంటింటికీ రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, చివరకు అది కూడా ఎగ్గొట్టినందుకు థ్యాంక్యూ థ్యాంక్యూ బాబూ అని చెప్పడానికి ఏమైనా వస్తారా అని ఆలోచన చేయండి అని కోరుతున్నాను. 

– ఏ ఒక్క స్కీమ్‌ను కూడా అర్హులందరికీ కాకుండా గ్రామంలో 10 వేల మంది అర్హులు ఉంటే.. కేవలం 10 మందికి మాత్రమే ఇచ్చి.. అది లంచాలు తీసుకుంటూ, కూడా జన్మభూమి కమిటీల ద్వారా వారికి నరకం చూపించిన ఆ పేద ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీరంతా థ్యాంక్యూ థ్యాంక్యూ బాబు అని చంద్రబాబు సభలకు వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. 

– కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచితంగా చదువులు చెప్పించేస్తా అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి చివరకు ఆ పిల్లలను సైతం వదలకుండా మోసం చేస్తూ.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ అనే పథకాన్ని నీరుగార్చినందుకు ఆ పిల్లలందరూ థ్యాంక్యూ థ్యాంక్యూ బాబు అని చంద్రబాబు సభలకు వస్తారా అని ఆలోచన చేయండి. 

– దత్తపుత్రా.. ఈ పాపంలో నీకు కూడా వాటా ఉంది కాబట్టి.. నీకు కూడా థ్యాంక్యూ థ్యాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.. 

వీరి సభలకు ఎవ్వరైనా ఎందుకు వస్తారండి.. ఈ దుర్మార్గులను చూడటానికా..? ఎవరు వస్తారండీ.. ఈ వంచకులను చూడటానికా..? ఘనకార్యం చేస్తే వీరిని అధికారంలో నుంచి ఎందుకు దింపేశారు..? నిజంగానే మంచి చేసి ఉంటే ఎందుకు ఈయన కొడుకును, దత్తపుత్రుడిని ప్రజలు ఓడించారని ఆలోచన చేయాలని కోరుతున్నా.. 

రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడు.. ఈ దుష్టచతుష్టయంతో బాగా దోచుకో, పంచుకో, తినుకో అని 2014 నుంచి 2019 వరకు బాబూ చేసి డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) స్కీమ్‌ చాలా బాగుంది.. థ్యాంక్యూ థ్యాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా అని ఆలోచన చేయండి. 

దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను ప్రతీ గ్రామంలోనూ పెట్టి, పెన్షన్లు కావాలంటే లంచం, ఇళ్లు కావాలంటే లంచం, సబ్సిడీతో కూడిన రుణాలు కావాలంటే లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలంటే కూడా లంచం లేనిదే పనిజరగని ఆ చంద్రబాబు నాయుడి పరిపాలన చాలా బాగుంది బాబూ.. థ్యాంక్యూ థ్యాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. 

ఎక్కడా లంచాలకు అవకాశం ఇవ్వకుండా, వివక్షకు చోటే ఇవ్వకుండా, ప్రజలకు అక్షరాల రూ.1.80 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం.. ఆ సొమ్ము నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావడం జరిగింది. ఇలాంటి మంచి ప్రభుత్వం బాగోలేదని, ప్రజలు ఏమైనా చంద్రబాబు సభలకు వస్తారా..? అని ఒక్కసారి ఆలోచన చేయండి అని కోరుతున్నా.. 

ఈ రాష్ట్రానికి ఇదేం ఖర్మ.. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టింది. మొన్ననే ఒక ఘటన. ఫొటో షూట్‌ కోసం డ్రోన్‌ షాట్‌ కోసం జనం బాగా రాకపోయినా, జనం బాగా వచ్చారని చూపించడం కోసం చిన్న సందు, గొందు.. ఇరుకురోడ్డులో జనాన్ని అక్కడకు నెట్టారు. తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశాడంటే.. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో సినిమా షూటింగ్‌ కోసం, డ్రోన్‌ షాట్ల కోసం ఒక దర్శకుడిని పక్కనే పెట్టుకొని.. 29 మందిని షూటింగ్‌ కోసం చంద్రబాబు చంపేశాడు. ఇలాంటి పెద్ద మనిషిని చూసినప్పుడు ఆరోజు కూడా రాష్ట్రమంతా ఇదేం ఖర్మరా బాబూ మన రాష్ట్రానికి అని. ఇదేం ఖర్మరా మనకు చంద్రబాబుతో అని రాష్ట్రమంతా అనుకుంది. అదే పరిస్థితిని ఈ రోజు రాష్ట్రంలో మళ్లీ చూస్తున్నాం. 

ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ చూసినప్పుడు రాజకీయాలు అంటేనే విరక్తి కలిగే పరిస్థితుల్లో ఈ వ్యవస్థను చూసినప్పుడు ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా.. రాజకీయం అంటే షూటింగ్‌లు కాదు.. రాజకీయం అంటే డైలాగులు కాదు.. రాజకీయం అంటే డ్రోన్‌ షాట్లు కాదు.. రాజకీయం అంటే డ్రామాలు అంతకంటే కాదు.. రాజకీయం అంటే ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనార్టీ కుటుంబంలో, ఒక నిరుపేద కుటుంబంలో, మధ్య తరగతి కుటుంబంలో, అక్కచెల్లెమ్మల కుటుంబంలో ఎలాంటి మంచి మార్పు తీసుకురాగలిగాం అనేది రాజకీయం. ఇది వీరందరికీ అర్థం కావాలి. 

రాజకీయం అంటే మన గవర్నమెంట్‌ బడి రూపురేఖలు మార్చడం రాజకీయం. మన గవర్నమెంట్‌ ఆస్పత్రి రూపురేఖలు మార్చడం, ప్రతి గ్రామంలో ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వ్యవసాయం రూపురేఖలు మార్చడం రాజకీయం. లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుండా ప్రతి పౌరసేవలను కూడా ప్రతి గ్రామంలో ఆత్మగౌరవంతో ఇవ్వగలగడం రాజకీయం. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడం రాజకీయం. మాటిస్తే.. ఆ మాట మీద నిలబడటం రాజకీయం అనేది వీరందరికీ అర్థం కావాలి. అన్ని ప్రాంతాలు, అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అంటారు. అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం దాన్ని రాజకీయం అంటారు. 

రాజకీయ నాయకుడు అంటే.. ప్రజలకు సేవకుడు. చంద్రబాబు మాదిరిగా ప్రజల మీద అధికారం చెలాయించడం కాదు రాజకీయం అంటే. చంద్రబాబుకు అర్జీ ఇవ్వడానికి ఎవరైనా వెళితే.. బీసీలు వెళితే తోకలు కత్తిరిస్తా అనే మాటలు విన్నాం. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనే మాటలు మాట్లాడాడు. ఇవి కాదు రాజకీయాలు. ఒక్క ముఖ్యమంత్రి దగ్గరి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజల సేవలు అనేది రాజకీయం. ఇలాంటి మంచి రాజకీయాలు మమకారంతో ప్రజల సేవకుడిగా, ప్రజల బిడ్డగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో చేశాం కాబట్టే.. ఎన్నికల వేళ ఒక మేనిఫెస్టో ఇచ్చి.. ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం కాబట్టే.. ఆ మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ 98.4 శాతం ఇప్పటికే నెరవేర్చాం కాబట్టే ఈరోజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో ప్రతి గడప దగ్గరకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం.. ఇవన్నీ చేశాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని సగర్వంగా వెళ్లి ప్రతి గడపనూ తట్టగలుగుతున్నారు. దీన్ని రాజకీయం అంటారు. చెప్పిన మాటను చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గర వెళ్లి మళ్లీ ఆశీర్వదించండి అని అడగడాన్ని రాజకీయం అంటారు. 

దేవుడి దయతో ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మంచి చేయగలిగాం. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఆ అవకాశం కూడా రావాలని మనసారా కోరుకుంటూ.. పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.  

 

Back to Top