ఎమ్మెల్యేలు ఎలీజా, గణేష్‌లకు సీఎం వైయ‌స్‌ జగన్‌ పరామర్శ

తాడేప‌ల్లి: ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. ఆయనను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సతీమణి ఝాన్సీరాణితో కూడా ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.

అలాగే మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో గాయపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ను ఫోన్‌లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Back to Top