రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన సీఎం వైయస్‌ జగన్‌

విజయనగరం: రైలు ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు, అధికారులకు సూచించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, క‌లెక్ట‌ర్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు.

Back to Top