ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్‌‌ జగన్ అభినందనలు

 శ్రీహరికోట : పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌(ఈవోఎస్‌ 01) శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్‌ 01 అధ్యయనం చేయనుంది. షార్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను చేపట్టారు. 

Back to Top