తాడేపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసిన మంత్రి పెద్దిరెడ్డిని సీఎం వైయస్ జగన్ అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైయస్‌ఆర్ సీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేసినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.