గద్దర్‌ మృతిపై సీఎం వైయ‌స్‌ జగన్ దిగ్భ్రాంతి

అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

తాడేపల్లి: తెలంగాణలో ఉద్యమ గళం, ప్రజా గాయకుడు గద్దర్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ సందర్బంగా సీఎం వైయ‌స్ జగన్‌..‘బడుగు, బలహీనవర్గా విప్లవ స్పూర్తి గద్దర్‌. ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణ పాటే. గద్దర్‌ నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికారు. గద్దర్‌ మరణం ఊహించలేనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోంది. గద్దర్‌ కుటుంబ సభ్యులకు మనమంతా బాసటగా ఉందాం’ అని అన్నారు. 

Back to Top