నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 

వైయ‌స్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసంలో ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు హారిక, పవన్‌ కుమార్‌ రెడ్డిలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశీర్వదించారు.


పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసంలో ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు జయశాంతి, సాయి శరణ్‌రెడ్డి లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశీర్వదించారు.

మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top