ప్రకాశం: దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. దర్శిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు రోహిత, రాజీవ్ మద్దిశెట్టిలను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. వివాహానికి హాజరైన ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.