తాడేపల్లి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో సీఎం స్టాలిన్ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్టు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్‌కు స్టాలిన్ స్పందన.. సీఎం వైయస్ జగన్ ట్వీట్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రియమైన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ధన్యవాదాలు అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు.