అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్నికల్లో అద్బుతమైన విజయం సాధించినందుకు కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు. పాలన విజయవంతంగా చేపట్టాలని కోరుతున్నా’ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.