నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి సీఎం హాజరు

విశాఖ: నెల్లిమర్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు మణిదీప్‌ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద రఘు ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు మణిదీప్‌- స్నేహలను ఆశీర్వదించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ వెంట వైయ‌స్ఆర్ సీపీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. 

Back to Top