నారాయణ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం వైయస్‌ జగన్‌

అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగల సహాయకులు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం వైయస్‌ జగన్‌ దిగువపల్లె చేరుకుంటారు. అంత్యక్రియల అనంతరం సాయంత్రం తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. కాగా, వైయస్‌ కుటుంబంతో నారాయణకు మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. 

Read Also: ‘తర్వాత దేని గురించి ఎగిరిపడతారో..’
  

Back to Top