ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు

నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ భార‌తీ

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంపతులు హజరయ్యారు. వైయ‌స్ఆర్ జిల్లాలో రెండవ రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉదయం ఇడుపులపాయ వైయ‌స్ఆర్ ఎస్టేట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్‌ భారతీ దంప‌తులు ఆశీర్వదించారు. సీఎం వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 

Back to Top