27న విజయవాడలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైయ‌స్‌ జగన్‌ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్‌ వించిపేటలో షాజహుర్‌ ముసాఫిర్‌ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.     

తాజా వీడియోలు

Back to Top