విజయవాడ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు. సీఎం వైయస్ జగన్, ఆయన సతీమణి భారతిలను సీజే జస్టిస్ ఠాకూర్ దంపతులు పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీజేకు సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఇటీవల సీజేగా జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.