కొత్త పరిశ్రమలకు సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన 

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో కొత్త పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో ను­వ్వుల ప్రాసెసింగ్‌ యూ­ని­ట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్‌ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్‌ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఏర్పాటు చే­సిన సిగాచి ఇండస్ట్రీస్‌ గ్రీన్‌­ఫీల్డ్‌ ఫార్మాస్యూ­టిక­ల్స్, ధాన్యం ఆధారిత బ­యో–­ఇథనాల్‌ త­యా­­రీ యూనిట్‌లను ప్రారంభించారు.

మౌ­లిక సదు­పా­యాల అభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయనున్న 17 ప్రాజెక్టుల్లో గుంటూరు, హిందూపూర్, మచి­లీపట్నంలో రూ.670 కోట్లతో పూ­ర్తయిన ప్రాజె­క్టులను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో స్టార్చ్‌ ప్రాసెసింగ్‌ యూ­నిట్, విజయ­నగరం, కర్నూలు­లో ఏర్పాటు చేసే ఆర్టీఈ/ఆర్టీసీ ఉత్పత్తుల త­యారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.

Back to Top