ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల సీఎం వైయ‌స్ జగన్ సంతాపం

 
విశాఖ‌: ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్‌ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి.

Back to Top