కే. విశ్వనాథ్‌ సతీమణి మృతి పట్ల సీఎం వైయ‌స్ జగన్ సంతాపం

తాడేప‌ల్లి: దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు.

కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్‌(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top