నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 

జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరైన ముఖ్య‌మంత్రి

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Back to Top